అక్రమంగా నిల్వ చేసిన యూరియా.. ఆగ్రహించిన రైతులు

ఫర్టిలైజర్ షాప్ యజమాని అక్రమంగా యూరియాను నిలువ చేశారని గోదాం ముందు పెట్రోల్ బాటిల్ తో రైతులు ఆందోళనకు దిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధిత రైతులు జుంకీలాల్, ధనరాజ్ లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్ షాప్ కి వెళ్లి రెండు యూరియా బస్తాలు ఆడినట్లు తెలిపారు. షాప్ యజమాని కర్ర కృష్ణారెడ్డి తమ వద్ద యూరియా స్టాక్ లేదని చెప్పినట్లు తెలిపారు. మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఉన్న గోదాం దగ్గరికి వెళ్లి చూడగా గోదాం నిండుగా యూరియా బస్తాలు ఉన్నాయని రైతులు తెలిపారు. ఈ విషయమై షాప్ యజమాని ప్రశ్నించగా సమాధానం దాటవేసినట్లు తెలిపారు. అనంతరం స్థానిక ఏవో ను ఫోన్లో సంప్రదించగా ఫిర్యాదు చేసినట్లయితే షాప్ యజమాని పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ శాంతించని రైతులు రాత్రి గోదాం లో ఉన్న బస్తాలను వేరే చోటికి మారిస్తే ఎట్లా అని వ్యవసాయ అధికారులు వచ్చి ప్లీజ్ చేయాల్సిందని పట్టుబడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై గోవర్ధన్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు.ఈ విషయమై ఏవో ని వివరణ కోరగా ఎవరైనా ఫర్టిలైజర్ షాప్ యజమానులు అక్రమంగా యూరియా నిలువలు చేసినట్లయితే వారిపై సెక్షన్ 6 ఏ కింద కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.