తీన్మార్ మల్లన్న పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
చింతకింది కుమారస్వామి బీసీ హక్కుల సాధన సమితి

వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీల రిజర్వేషన్ల అంశాలపై సానుకూలంగా ఎవరు స్పందించిన బీసీలకు మద్దతుగా ఉద్యమాలు చేసినా ఆహ్వానిస్తాం అని కుమారస్వామి అన్నారు బీసీ హక్కుల సాధన సమితి సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కుమారస్వామి నల్లబెల్లిలో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న పై కవిత గ్రూపు చేసిన దాడిని ఖండించారు.10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కల్వకుంట్ల కవిత ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ బీసీలకు వారి వాటా ప్రకారం వారికి పార్టీలో కానీ స్థానిక సంస్థలలో కానీ చట్టసభలలో కానీ విద్య ఉద్యోగ అవకాశాలలో కానీ రిజర్వేషన్లు ఇవ్వాలని కల్వకుంట్ల కవిత ఏనాడు పార్లమెంటులో కానీ పార్టీ వేదికలలో కానీ ప్రకటించలేదు బీసీల తరఫున పోరాడలేదు తీన్మార్ మల్లన్న కవితపై ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా కవిత భావించి ఉంటే ఆ వాక్యాలను ఖండిస్తూ బీసీల తరఫున తాను చేస్తున్న ఉద్యమాన్ని శంకించవలసిన అవసరం లేదని వివరణ అడిగి ఉంటే బాగుండేది అలా కాకుండా బీసీల అభివృద్ధి కోసమే నిజంగా ఉద్యమిస్తున్నట్టుగా కల్వకుంట్ల కవిత భావిస్తే బీసీల కోసం ఉద్యమిస్తున్న తీన్మార్ మల్లన్న మీద దాడి చేయవలసింది కాదు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేసి మల్లన్న గాయపరిచి గన్మెన్ దగ్గర ఉన్న గన్నును లాక్కోవడం ఏ మాత్రం సహించరానిది కాదన్నారు ఇప్పుడిప్పుడే ఏకమవుతున్న బీసీల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించే చర్యలకు పాల్పడవద్దని కవితను డిమాండ్ చేశారు ఇలాంటివి ప పు నరావృత్తం కాకుండా ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నల్లబెల్లి గ్రామ కన్వీనర్ సామాల దేవేందర్ కో కన్వీనర్ కోల లింగయ్య మేడిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.