దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి

దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి

– గత ప్రభుత్వంలో ఆలయాల అభివద్ధిని పూర్తిగా విస్మరించింది

– అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే తప్పుడు మాటలు

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం, జూలై 17 (పీపుల్స్ డైరీ): రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గొప్ప కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం వివిధ గ్రామాలల్లో జిల్లా జడ్పీ సీఈవో, దేవాదాయ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి గణపురం మండల కేంద్రంలో పెద్దమ్మతల్లి ఆలయం రూ. 10 లక్షల, మండలంలోని బుద్దారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి, శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ బీరన్న ఆలయాలల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే టెంకాయలు కొట్టి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆలయాల అభివద్ధిని పూర్తిగా విస్మరించిందని, పదేళ్లలో ఒక్క యాదగిరిగుట్ట నిర్మాణం తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఆలయాల గురించి పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. జీవోలు జారీ చేసి నిధులు కేటాయించలేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

– అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే తప్పుడు మాటలు

భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో కేవలం కొత్తపల్లిగోరి మండలాన్ని మాత్రమే ఏర్పాటు చేసిందని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే ఎమ్మార్వో, ఎంపీడీవో భవనాలను మంజూరీ చేశానని అన్నారు. మరో రెండు మూడు రోజుల్లోనే కొత్తపల్లిగోరిలో పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి తక్కువ ధరకు ఇసుకను అందిస్తుంటే అది చూసి మాజీ ఎమ్మెల్యే తట్టుకోలేక ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, ఆర్ ఎన్ ఆర్, పిఎసిఎస్ చైర్మన్లు కన్నబోయిన కుమార్ యాదవ్ గండ్ర సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ వైస్ చైర్మన్ దూడపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు విడిదినేని అశోక్, చోటే మియా, ఏఎంసీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్, బత్తిని శివశంకర్ గౌడ్, నారగాని దేవేందర్ గౌడ్, మోటపోతుల శివశంకర్ గౌడ్, వడ్లకొండ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *