దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్

పీపుల్స్ డైరీ 17 జూలై నల్లబెల్లి
దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఎస్సై వివరాలు ప్రకారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఈ నెల 14వ తేదీ సోమవారం రోజున అర్ధరాత్రి మండల కేంద్రంలోని తిరుమల వైన్ షాప్ లో చోరీ జరిగినట్లు షాప్ యజమాని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇద్దరు కలిసి తిరుమల వైన్స్ వెంటిలేటర్ ను పగలగొట్టి ప్రశాంత్ అందులో లోపలికి వెళ్లి క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులు దొంగలించి కాపలాగా సాయికుమార్ ఉన్నాడు .గురువారం శనిగరంలో తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు ప్రశాంత్, సాయికుమార్ లు పారిపోతుండగా పట్టుకొని విచారించగా బ్రాందీ షాప్ లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుండి 19800 జప్తు చేసి వారిని జ్యూడిషల్ కస్టడికి తరలించినట్లు తెలిపారు.