సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు ఒక వరం
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
– 25 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

గణపురం, ఆగస్టు 03 (పీపుల్స్ డైరీ): ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక వరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం గణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలలో సీఎంఆర్ఎఫ్ నిధుల కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను 25 మందికి రూ. 9,17000 గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ పథకం పేద ప్రజలకు ఒక వరంగా మారింది.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడి పక్షాన నిలుస్తోంది. మానవతా దృష్టితో ఈ సహాయ నిధులను వేగంగా మంజూరు చేస్తున్న ప్రభుత్వం పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. అలాగే, వైద్యంలో ఉన్నత చికిత్స అవసరమైన వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని, మరిన్ని లబ్ధిదారులు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని ఉపయోగించుకోవాలని సూచించారు.గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పాలనలో వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శించి ఆసుపత్రిలో సౌకర్యాలు లేవనడం సిగ్గుచేటు అన్నారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.