*ఆటో డ్రైవర్లకు మై ఆటో ఇస్ సేఫ్ స్టిక్కర్ల పంపిణీ*

మేడ్చల్, ఆగస్ట్ 5( పీపుల్స్ డైరీ):హ3
మేడ్చల్ ఆటో డ్రైవర్లకు మై ఆటో ఇస్ సేఫ్ స్టిక్కర్లను మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ మాట్లాడుతూ ఈ స్టిక్కర్లను ఆటోలకు ఇరువైపులా వేసుకోవాలని సూచించారు. ఈ స్టిక్కర్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సీఐ తెలిపారు. ఆటో డ్రైవర్లు మద్యం సేవించి ఆటోల ను నడపవద్దని, ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని సూచించారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ హనుమాన్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి యూనియన్ అధ్యక్షులు ఎర్ర విజయరావ్, ఆటో డ్రైవర్లు జాంగిర్, సురేష్ ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, గణేష్ సత్యనారాయణ, ఓం రాజు తదితరులు పాల్గొన్నారు.