*ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు*
Sri Krishnashtami celebrations in full swin
మేడ్చల్, ఆగస్టు 16 (పీపుల్స్ డైరీ )
ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలోని ఇస్కాన్ దేవాలయం నందు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా భక్తులతో సందడి నెలకొంది. హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుడి అవతారం ఎంతో ప్రత్యేకమైనది. శ్రీమహావిష్ణువు అవతారాలలో ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం, పరమాత్ముడు బహుళ పక్షాష్టమి తిధి రోజున రోహిణి నక్షత్రం లో జన్మించారు ఆ రోజుని శ్రీ కృష్ణాష్టమి, జన్మాష్టమి, అని పిలుచుకుంటారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూలు పళ్ళు పంచభక్ష పరమాన్నాలు సమర్పించుకున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్ని కృష్ణుడి వేషధారణలో అలంకరించి దేవాలయంలో కలియ తిరుగుతూ సందడి చేశారు. దేవాలయానికి వచ్చిన భక్తులు సంకీర్తనలతో కోలాటలు ఉట్టి కొట్టడాలు స్వామివారి కి అలంకరణలు నైవేద్యాలు చేసుకుంటూ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు.
*మాజీ ఎంపీపీ ప్రత్యేక పూజలు*
ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామ పరిధిలోగల ఇస్కాన్ దేవాలయంలో మేడ్చల్ మండల మాజీ ఎంపీపీ రజిత డబిల్ పూర్ మాజీ సర్పంచ్ రాజ మల్లారెడ్డి శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
