జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది టి ఎస్ జే యూ
– జర్నలిస్ట్ లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
– జిల్లా అధ్యక్షులు సంతోష్, ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవిందర్

పీపుల్స్ డైరీ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ( ఎన్ యు జె ఐ) అని జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు అన్నారు. గురువారం కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్ట్ ల పక్షాన టి ఎస్ జే యూ పోరడుతుందని స్పష్టం చేశారు.ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రయివేటు,కార్పొరేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పించిన ఘనత మాదే అన్నారు. జర్నలిస్ట్ ల భద్రత దృష్ట్య ఏ యూనియన్ చేయని విధంగా టి ఎస్.జే.యూ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం, ప్రధానం కార్యదర్శి తోకల అనిల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ల సూచనతో యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి జర్నలిస్ట్ కు రూ.5 లక్షల ప్రమా భీమా కల్పించిన ఏకైక యూనియన్ మాదే అన్నారు. అంతే కాకుండా టి ఎస్ జెయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదార్థాల నియంత్రణపై విస్తృత కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కొన్ని యూనియన్లు మా యూనియన్ సభ్యులను మభ్యపెడుతూ తమ యూనియన్లో చేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది.ఆ యూనియన్ నేతలు ఇప్పటివరకు జర్నలిస్టులకు ఏం చేశారో చెప్పాకే జర్నలిస్ట్ లు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.మా యూనియన్ ఎప్పుడు జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని జర్నలిస్టులు మిత్రులకు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి కారుకూరి సతీష్, సంయుక్త కార్యదర్శి కడపక రవి, బోళ్లపల్లి జగన్ గౌడ్, మారపల్లి చంద్రమౌలి, దేవేందర్ తదితరులు పాల్గోన్నారు