బుద్దారంలో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన

బుద్దారంలో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన

గణపురం, ఆగస్టు 24 (పీపుల్స్ డైరీ): మండలంలోని బుద్దారం గ్రామంలో మోడల్ అంగన్వాడీ కేంద్ర భవనాలకు ఆదివారం జెన్కో సీఎస్ఆర్ నిధులు రూ.80 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు అధికారులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థి సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, విడితినేని అశోక్, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *