అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా…?
– అభివృద్ధిలో భాగంగానే కూల్చివేత
– అభివృద్ధిని అడ్డుకోవడం బీఆర్ఎస్ నాయకులకు తగదు
– గణపురం, భూపాలపల్లి అభివృద్ధిలో ముందు వరుసలో ఉంది
– గణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు

పీపుల్స్ డైరీ, గణపురం: అభివృద్ధిలో భాగంగానే కూల్చివేత, అభివృద్ధిని అడ్డుకోవడం బీఆర్ఎస్ నాయకులకు తగ్గదు అని గణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం వారాంతపు సంత ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చెరువు కట్ట పై టూరిజం హబ్ ఏర్పాటులో భాగంగా రోడ్డు విస్తరణ చేయడం జరుగుతుంది, కట్టకు రిటర్నింగ్ వాల్, రోడ్డు వేయడం జరుగుతుంది, తొలగించిన సంత స్థలంలో ఒక ఎకరం ప్లేస్ లో సీసీ రోడ్డు వేసి టాయిలెట్స్ వెనుకకు జరిపి కట్టి అదే ప్లేస్ లోసంత నిర్వహణ మరియు బతుకమ్మ ఆడుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి కూల్చివేతకు ఐబీ అధికారుల పర్మిషన్ తీసుకొని అధికారులే దగ్గరుండి కూల్చి వేస్తున్నారు. దానిని బిఆర్ఎస్ నాయకులు తెలుసుకోకుండా, ఎమ్మెల్యేని బదనం చేస్తున్నారు. బిఆర్ఎస్ నాయకులకు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా మా ఊరి సంత ఏ రోజైనా దానిలో సంత నిర్వహించార, సొంత జరిగితే రోడ్డుమీనే జరుగుతుంది 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మా ఊరి సంతలో ఎందుకు నిర్వహించడం లేదని అధికారులను గాని ప్రజా ప్రతినిధులను గాని అడిగిన పాపాన పోలేదు వేసిన తాళం వేసినట్టే ఉండేదని కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మీకు తెలియజేస్తున్నాం. భూపాలపల్లి శాసనసభ్యులుగా ఎన్నికై 20 నెలల కాలంలో గణపురం చెరువు కట్టకు సిసి రోడ్డు, గణపేశ్వరాలయంకు సిసి రోడ్డు అదే విధంగా 100 ఫీట్ల రోడ్డు మంజూరు చేయించుకొని వచ్చి గణపురం మండలం, భూపాలపల్లిని అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉంచిన మా నాయకుడిని చూసి కళ్ళు కుట్టి ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తున్నారని బ్రష్ నాయకులు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారు రానున్న స్థానికైనా ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల కోఆప్షన్ సభ్యులు ఎమ్డికో చోటేమియా, మాజీ సర్పంచ్ నారగని దేవేందర్, మండల అధికార ప్రతినిధి మామిళ్ల మల్లికార్జున్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ, వార్డు మెంబర్లు గంధం ఓదాకర్,మామిళ్ల మల్లేష్, ఎస్ కే జానీ, ఎస్ కే సైదులు, దేవేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.