బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం*

*బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం*

 

మేడ్చల్ సెప్టెంబర్ 17(పీపుల్స్ డైరీ):-

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ నిజం ప్రభుత్వం నిరంకుశ్వ పాలనకు,నిజాంకి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజం ప్రభుత్వ మెడలు వంచి 1948 సం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించి,భారత దేశంలో విలీనం చేసి స్వతంత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి,మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి, బీ.జె.వై.ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగం అర్జున్,ఎల్లంపేట్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్,మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి ప్రధాన కార్యదర్శిలు కానుకంటి వంశీ విజయ్ వంజరి,జకట ప్రేమ్ దాస్,మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి లవంగ శ్రీకాంత్,మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి కార్యదర్శి డి.సాయి,సత్యనారాయణ రెడ్డి,మేడ్చల్ ఉమ్మడి మండల మహిళా మోర్చ నాయకులు మల్లాది హేమలత రెడ్డి,పుష్ప మల్లారెడ్డి,శోభా రాణి,మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి కార్యవర్గ సభ్యులు దగ్గు రాజు,మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి నాయకులు గౌలికర్ మహేష్,జకట బాబు రాజు, బొజ్జ వంశీ, అర్జున్, మధుసూదన్ రెడ్డి, ఎల్లంపేట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *