ఇంత నిర్లక్ష్యమా…?

  • ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి బయటపడ్డ నిర్లక్ష్యం

  • ఒక గ్రూపు బ్లడ్‌కు బదులుగా మరో గ్రూపు బ్లడ్‌ ఎక్కించిన వైద్యులు

  • రోగి పరిస్థితి విషమం

పీపుల్స్‌డైరీ-వరంగల్‌ : వరంగల్‌ ఎంజీఎంలో తరచుగా జరుగుతున్న పొరపాట్లు రోగుల ప్రాణాల మీదకు వస్తున్నాయి. నిత్యం అప్రమత్తంగా ఉండి రోగుల ప్రాణాలు కాపాడాల్సింది పోయి నిర్లక్ష్యపు వైద్యంతో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఎంజీఎంలో జరిగిన నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లినట్టు తెలిసింది. ఫిమేల్‌ మెడికల్‌ వార్డులో జ్యోతి అనే రోగికి రక్తం అవసరం రావడంతో ఏ పాజిటివ్‌ బదులుగా వేరే బ్లడ్‌ గ్రూపును వైద్యులు ఎక్కించడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో వైద్యులు గుట్టు చప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనతో వైద్య సిబ్బంది తీరుపై జ్యోతి బంధువులు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *