గుండెపుడి లో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

గుండెపుడి లో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

ఆడి పాడిన మహిళలు

పువ్వులను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిక

గ్రామ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

మాజి సర్పంచ్ నూకల కిషన్ రెడ్డి

 

 

మరిపెడ , సెప్టెంబర్ 21,(పీపుల్స్ డైరీ):

 

మరిపెడ మండల కేంద్రంలో గుండెపుడి గ్రామం లో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తీరొక్క పూలతో అంగరంగ తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి. తొలిరోజు ఎంగిలి పువ్వు పండుగ సంబురంగా షురూ అయ్యాయి. ఈ రోజు గునుగు ,తంగేడు పట్టుకుచ్చు ,బంతి ,చామంతి వంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలు అంత ఒకచోట చేరి ఆడి పాడడం సాంప్రదాయం. అయితే ఇలా తొలి రోజున పేర్చిన బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ ‘గా పేర్కొంటారు. అలాగే ఈ రోజున అమ్మకు తులసి ఆకులు, వక్కలు ,నైవేద్యంగా సమర్పిస్తారు.మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను అలంకరించారు. సాయంత్రం బతుకమ్మలను ఒకేచోటకు చేరి ఉయ్యాల పాటలతో హోరెత్తించారు.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ కోలాహలంగా పండుగను జరుపుకున్నారు. బతుకమ్మ అంటేనే ప్రకృతిని పూజించే.. పూలనే కొలిచే పండుగ రామాలయం గుడిలో వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. బతుకమ్మలతో రామాలయం ఆలయానికి మహిళలు పోటెత్తారు. ఉయ్యాల పాటలతో గుండెపుడి రాములవారి ఆలయం మారుమోగింది. సంబరాలు ఘనంగా జరిగాయి. ఆట పూర్తయిన తర్వాత మహిళలు ఈ ప్రసాదాన్ని ఒకరికోకర్ ఇచ్చి పుచ్చుకుంటారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు , సిపిఎం నాయకులు,గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *