పిడుగుపాటుకు ఒకరి మృతి

పీపుల్స్ డైరీ సెప్టెంబర్ 22 దుగ్గొండి
దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లె గ్రామపంచాయతీ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొద్దు రాకేష్ తన మిరప చేను వద్ద పనులు చేసుకుంటుండగా సోమవారం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు మెరుపులతో వర్షం కురిసిన సందర్భంగా పడిన పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.ఈ సంఘటనతో గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. రాకేష్ అకాల మరణం కుటుంబ సభ్యులను కన్నీరులో ముంచేసింది. స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
.