బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి.

నల్లబెల్లి
హైకోర్టు కేసు ప్రతులను దగ్ధం చేసిన బీసీ హక్కుల సాధన సమితి నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా బీసీ వ్యతిరేక వైఖరితో మోడీ ప్రభుత్వం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బీసీ హక్కుల సాధన సమితి మండల నాయకులు అన్నారు. మండల కన్వీనర్లు జక్కుల భగత్ ,బొడిగె వంశీ జక్కుల తరుణ్,జక్కుల మణిదీప్ ,జక్కుల కార్తీక్ లో నాయకత్వంలో మండల కేంద్రము అయిన నల్లబెల్లి బస్టాండ్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టులో వేసిన కేసు ప్రతులను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించకుండా బీసీ ప్రధాన మంత్రిని అంటున్న మోడీ ఎందుకు ఆమోదించడం లేదనీ ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం కారణంగానే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయ న్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ ద్వారా బలమైన ఉద్యమాన్ని నిర్మించి మోడీ ప్రభుత్వం బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వైనాల వీరస్వామి, పండుగ తరుణ్ బొడిగే చంద్రకాంత్ ఎలబోయీన హిమవంత్ అల్లె రాంచరణ్ సంగెం సిద్దూ గడ్డం రితీష్ జక్కుల భార్గవ్ బన్నీ కళ్యాణ్ ,బీసీ హక్కుల సాధన సమితి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు