ఏన్కూర్ లో ఘనంగా వన సమారాదన మహోత్సవాలు.
ఏన్కూర్, నవంబర్ 16,
(పీపుల్స్ డైరీ):

ఏన్కూర్ లో ఆదివారం కమ్మ వన సమారాధన, మున్నూరు కాపు వన సమారాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో హోరెత్తించారు. తొలుత కార్తీక మాస పూజలు నిర్వహించారు కమ్మ సంఘం వన సమారాధనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు గుత్త వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అదేవిధంగా మున్నూరు కాపు వన మహోత్సవానికి నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, శెట్టి రంగారావు, పురుషోత్తమరావు హాజరయ్యారు. చిన్నారులు యువకులు ఆటపాటలతో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వన సమారాధన మహోత్సవాలు గురించి ప్రముఖులు వివరించారు. అనంతరం సామూహిక వనభోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.