నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం దొరికిన సొమ్మును అప్పగించిన విద్యార్థులు..

హన్మకొండ జిల్లా:
నగరంలోని పెగడపల్లి డబ్బాలు జంక్షన్ లో నిజాయితీకి ప్రతీకగా ఇద్దరు విద్యార్థులు నిలిచారు.ఏకశిల ఉన్నత పాఠశాలలో చదువుతున్న పూజిత, లిథివిక్ అనే బాలబాలికలు తాము బడికి వెళ్లే ప్రాంతములోని రహదారిపై రూ. 400 నగదును గుర్తించారు.ఆ మొత్తాన్ని ఏమాత్రం ఆలోచించకుండా అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రమేష్ గంగాధర్ కు అప్పగించారు.డబ్బు చిన్నదైనా, పెద్దదైనా నిజాయితీగా ఉండడమే ముఖ్యమని గుర్తించిన విద్యార్థుల ధర్మాన్ని కానిస్టేబుల్ అభినందించారు.విద్యార్థులు అప్పగించిన సొమ్మును పోలీసు స్టేషన్‌లో జమ చేస్తానని ఆయన తెలిపారు.విద్యార్థులు పూజిత, లిథివిక్‌ల నిజాయితీని అందరూ ప్రశంసిస్తున్నారు.