ఐదుగురు మహిళ దొంగలు అరెస్ట్..

ఐదుగురు మహిళ దొంగలు అరెస్ట్..

చెత్త ఏరుకునే నెపంతో దొంగతనం..

రేగొండ :- జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమల గిరి గ్రామంలో దొంగతనం కేసులో నలుగురు మహిళ దొంగలను అరెస్ట్ చేసినట్టు ఎసై సుధాకర్ తెలిపారు..
తిరుమల గిరి గ్రామనికి చెందిన రవీందర్ రెడ్డి అనే రైతు తన వ్యవసాయ బావి నుండి ఇంటికి తిరుగి వచ్చేసరికి ఇంటి వద్దా ఉన్నా నీళ్ల హౌస్ దగ్గర ఐదుగురు మహిళలు నీళ్ల మోటార్ ను సంచిలో వేసుకొని తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా గమనించిన రవీందర్ అరిచి కేకలు వేయడంతో చుట్టూ ప్రక్కల ఉన్నా వ్యక్తులు రవీందర్ ఇంటికి చేరుకొని వారిని అడ్డుకొని ప్రశ్నించగా వారు దొంగ తనం ఒప్పుకున్నట్టు తెలిపారు.. వరంగల్ జిల్లా శివనగర్ కు చెందిన తూర్పటి ప్రేమ, నూనె మల్లమ్మ, సొగల సమ్మక్క, రుద్రాక్ష స్వాతి, తూర్పటి మైసమ్మ,లుగా గుర్తించినట్టు ఎసై వివరించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో చెత్త ఏరుకునే నెపంతో వచ్చి నీళ్ల మోటార్ ను దొంగతనం చేయుటకు ప్రయత్నం చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు తమ ఇళ్లలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని ఎసై సుధాకర్ కోరారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *