ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్
ఎల్కతుర్తి మార్చి 22
( పీపుల్స్ డైరి)

ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి పోలీస్ . ఆదివారం సీఐ పులి రమేష్ మరియు ఎస్ ఐ ప్రవీణ్ కుమార్. ఎల్కతుర్తి నుండి రోడ్డు కు ఇరు వైపులా కరీంనగర్ రూట్ ,సిద్దిపేట రూట్ ,హన్మకొండ రూట్ ,మరియు ఎల్కతుర్తి సెంటర్ వద్ద ప్రమాదాల హెచ్చరిక బోర్డుల ను ఏర్పాటు చేశారు. వాహనధారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వాహనాలకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని తెలిపారు . వీరి వెంట అఖిల్ ,శ్రీనివాస్ ,శ్రీధర్ సిబ్బంది ఉన్నారు