పర్యాటక క్షేత్రంగా కోటంచ…
ఆలయానికి పెరుగుతున్న భక్తుల రద్దీ…
భూపాలపల్లి (రేగొండ )మర్చి 22 పీపుల్స్ డైరీ…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా రోజు రోజుకు పెరుగుతుంది, పండుగలు మరియు వారాంతాల్లో విశేషంగా పెరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఆలయ పునరుద్ధరణకు ₹82.25 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల పనులు చేపట్టారు, ఆలయ అభివృద్ధి కావడం వల్ల రోజు రోజుకి భక్తుల రద్దీ పెరుగుతుంది.
ఇది భవిష్యత్తులో రద్దీని మరింత పెంచే అవకాశం ఉంది. లక్ష్మీనర్సింహస్వామి ఆలయం చుట్టుపక్కల పలు ఉప ఆలయలు నాగులమ్మ గుడి, భక్తులు విడిది కోసం ప్రత్యేక గదులు నిర్మించరు. ఉమ్మడి వరంగల్ జిల్లా భక్తులకు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం.
అభివృద్ధి చెందింది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.
సాధారణ రోజుల్లో భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు, కానీ ప్రత్యేక పూజల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయ అభివృద్ధి చెందడంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు…