భరోసా లేని బడ్జెట్…

భరోసా లేని బడ్జెట్

బడ్జెట్ అంతా డోల్ల…

ఆరు గ్యారెంటీల అమలు పై చిత్తశుద్ధి కనబర్చాలి..

మీడియా సమావేశంలో

మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణరెడ్డి .. ఏనుగుల రాకేష్ రెడ్డి,

భూపాలపల్లి మార్చి 22 పీపుల్స్ డైరీ.

భరోసా లేని బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ప్రజలకు గంపేడు ఆశలు చూపిస్తూ మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి లు మండిపడ్డారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఒట్టి డోల్ల బడ్జెట్ అని ఏద్దేవా చేసరు. సబ్బండ వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఈ బడ్జెట్ తో ప్రజలకు ఎన్ను పోటు పొడిచారని ఏనుగుల రాకేష్ రెడ్డి, అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసి, రైతాంగానికి అపూర్వమైన పథకంగా రైతుబంధును ప్రవేశపెట్టారు.

అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు.
అయితే, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు భిన్నమైన పాలన అందిస్తామని చెప్పి, “ఆరు గ్యారెంటీలు” పేరుతో హామీలు ఇచ్చింది.

గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసి ప్రజల్లో విశ్వాసం కల్పించింది.
ఆ విశ్వాసంతోనే ప్రజలు ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని
ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్ల కాలంలో ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంటే దాదాపు 60% పదవీకాలం పూర్తయింది. అధికారంలోకి వచ్చే ముందు 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, వాటికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు.మొట్ట మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఈ పథకాలకు చట్టబద్ధత తీసుకువచ్చినట్టుగా చెప్పినా, అది కేవలం నాటకంగా మిగిలిపోయిందన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు.కానీ ఆ ఆశలు అన్నీ నిరాశలయ్యాయని .
గత సంవత్సరం కంటే కూడా ఈసారి పథకాలపై నిధుల కేటాయింపులు తగ్గడం ఆందోళన కలిగించే విషయన్నారు.
ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి గత ఏడాది కేటాయించిన నిధులతో పోలిస్తే ఈ సంవత్సరం కేటాయింపులు సరిపోలడం లేదని.

ఎన్నికల సమయంలో ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రజా ప్రతినిధులు,ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
అలాగే రైతులకు రైతుబంధు ఇస్తామని పదేపదే చెప్పినా, అది కూడా ఆలస్యం అవుతోంది.
గతంలో కేసిఆర్ పాలనలో రైతులకు నాట్లు వేయక ముందే రైతు బంధు అందేది.

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మహిళలకు ఇచ్చిన హామీలు కూడా.మహాలక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పారు. కానీ ఈ బడ్జెట్‌లో దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అలాగే తులం బంగారం,ఆడపిల్లలకు స్కూటీ వంటి హామీలు కూడా కనిపించడం లేదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రసంగం భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలి.ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మార్పులు చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తగిన నిధులు కేటాయించాలి. ఆరు గ్యారెంటీల అమలు కోసం చర్యలు తీసుకోవాలి. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత.

ఈ నేపథ్యంలో స్థానిక శాసన సభా సభ్యుడు కూడా ఆరు గ్యారెంటీల అమలుకు కృషి చేసి, ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *