బ్యాంకుల్లో అలారం సిస్టం తప్పనిసరి
పీపుల్స్ డైరీ నవంబర్ 21 దుగ్గొండి
బ్యాంకులో దోపిడీలు జరిగేటప్పుడు అలారమ్ మోగేలా చూసుకోవాలని దుగ్గొండి సీఐ సాయి రమణ పేర్కొన్నారు. దుగ్గొండి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో గురువారం దుగ్గొండి సీఐ సాయి రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సాయి రమణ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఎల్లవేళలా పని చేస్తున్నాయా లేదానన్న విషయాన్ని ప్రతీ రోజు మానిటరింగ్ చేసుకోవాలన్నారు. నేర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అలారమ్ వచ్చే సిస్టమ్ ఎల్లవేళలా పని చేసేలా ఉండాలన్నారు. బ్యాంకులో కిటికీలు, డోర్స్, స్ట్రాంగ్ రూమ్స్ లను 15 రోజులకోమారు పని చేస్తున్నాయా.. లేదా అన్న విషయాన్ని పరిశీలించుకోవాలన్నారు. ఆయా బ్యాంకు మేనేజర్ల వద్ద ఎస్సై ఫోన్ నంబరు అందుబాటులో ఉండాలన్నారు. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు డబ్బులు, బంగారు ఆభరణాలను తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా సెక్యూరిటీ మేనేజర్ నీ వెంట తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో దుగ్గొండి ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు, బ్యాంకు మేనేజర్ దాస్ నాయక్ ,సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.