ముందు జాగ్రత్త…!

మందుబాబులకు ఆనందకర వార్త

పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : మందుబాబులు విషయంలో సర్కార్‌ ముందు జాగ్రత్త చర్యలకు పూనుకుంది. మున్ముందు మందు కొరత రాకుండా ఇప్పటి నుంచి పలు నిర్ణయాలు తీసుకుంటుంది. గత వేసవిలోని అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. వచ్చే ఎండకాలం కోసం ఇప్పటి నుంచి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. వచ్చే వేసవిలో మందుబాబులకు సరిపడా బీర్లు అందుబాటులో ఉండాలని.. ఎక్కడా నో స్టాక్‌ బోర్డులు కనిపించకుండా జాగ్రత్త పడాలని బేవరేజెస్‌ కంపెనీలకు ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు బేవరేజెస్‌ కంపెనీలు ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచినట్టు తెలుస్తోంది. ధరల విషయంతో పాటు వచ్చే సీజన్‌కు లిక్కర్‌ ప్రొడక్షన్‌ విషయంలో ఎక్సైజ్‌ శాఖ కీలక అడుగులు వేస్తున్నట్టు అవగతమవుతోంది. అయితే.. ప్రస్తుత సీజన్‌కు సరిపడా మద్యం నిల్వలను సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం.. వచ్చే వేసవి కోసం కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అసలే వచ్చేది వేసవి కావటంతో.. మందుబాబులు చల్లచల్లని బీర్ల కోసం వైన్‌ షాపులకు పరుగులు పెడుతుంటారు. కాగా.. గడిచిన వేసవిలో సరిపడా బీర్లు లేక.. వైన్‌ షాపులలో నో స్టాక్‌ బోర్డులు దర్శనం ఇవ్వటంతో.. మద్యంప్రియులు తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *