రామారెడ్డి – ఇసన్నపల్లి గ్రామలో గల మహా పవిత్ర పుణ్యక్షేత్రం కాలభైరవ స్వామి ఆలయం వద్ద కార్తీకామాసోత్సవాలు ఘనంగా నిర్వహించామని ఆలయ సిబ్బంది తెలిపారు. ఉత్సవాల సందర్భం గా రెండో రోజు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వ హించిన ట్లు ఈవో ప్రభు తెలిపారు. అర్చక వేద పండితులచే దేవాలయాలోను నిత్యకైంకర్యాల తో పాటు పరివార దేవతలకు షోడషోపచార పూజలు చేశామని అర్చకులు శ్రీనివాస్ శర్మ అన్నా రు.సాయంత్రం ఆలయ ప్రధాన ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపం వెలిగించిన అనంతరం స్వామి వారిని పల్లకీలో వేంచేపుచేసి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం పుష్కరిణి వద్ద అధిష్టించి సంకల్ప షోడష పూజాధికాలు చేశారు. లక్ష దీపార్చనలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి అధికంగా వచ్చిన మహిళలు, భక్తులు దీపాలు వెలిగించారు. దశవిధ హారతుల దర్శన భాగ్యాన్ని తెలుపుతూ, ప్రవచన పూర్వక కార్యక్రమాలను నిర్వహించగా.. భక్తులు తిలకించి కాలభైరవుని ఆశీర్వాదం పొందారు.