కుటుంబ సమగ్ర సర్వే పరిశీలన…
పీపుల్స్ డైరీ : నల్లబెల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, ముమ్మరంగా కొనసాగుతుంది. ఆదివారం మండల స్పెషల్ ఆఫీసర్ సిపిఓ గోవింద రాజన్ మరియు సీఈవో రామ్ రెడ్డి ఆన్లైన్ డాటా ఎంట్రీని పరిశీలించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, సర్వే (సమగ్ర కుటుంబ సర్వే) వివరాలను ఆన్లైన్ చేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు వారు సూచించారు. కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించేటప్పుడు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. తప్పులు దొర్లకుండా, సమయపాలన పాటించి తొందరగా పూర్తి అయ్యేటట్లు విధులు నిర్వహించాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు పూర్తిస్థాయిలో డాటా ఎంట్రీ చేపట్టి నివేదికలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేయనున్నట్లు వారు తెలిపారు.డేటా ఎంట్రీ ఆపరేటర్స్, గ్రామ కార్యదర్శులకు సూచనలు సలహాలను ఇచ్చారు. డేటా ఫారంలు బయటపోకుండ జాగ్రత్తగా వహించాలని అన్నారు. రోజు వచ్చిన డేటా ఫారంలను ఎంట్రీ చేసేయాలని అన్నారు. గ్రామంలో ఏ ఒక్క ఇల్లు తప్పకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పుకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు