ఘనంగా నో బ్యాగ్ డే ఉత్సవాలు

ఘనంగా నో బ్యాగ్ డే ఉత్సవాలు

 

దుగ్గొండి : మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శ వాణి హై స్కూల్ లో ఘనంగా నో బ్యాగ్ డే ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, క్రీడలు, నృత్యాలు, చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్‌ పోటీల నిర్వహణ, నీతికథలు, శాస్త్రసాంకేతిక అభివృద్ధి, ఆటలు,చిత్రలేఖనం, కథల పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు, కృతిమ మేధ,మిమిక్రీ వంటి సృజనాత్మకతను వెలికితీసే పలు కార్యక్రమాలను పొందుపరిచారు. కార్యక్రమంలో బాగంగా చైర్మన్ శ్రీ నాగనబోయిన రవి మాట్లాడుతూ ప్రతి నెల చివరి రోజును నో బ్యాగ్ డే నిర్వహించడం ద్వారా పిల్లల పూర్తి వికాసానికి దోహద పడుతుందని,విద్యార్థులకు పుస్తక వి జ్ఞానమే కాకా మానసిక, శారీరక, సాంస్కృతిక విజ్ఞానం కూడా అత్యంత అవశ్యకం అని, అందుకు గాను ప్రతి నెల చివరి రోజును నో బ్యాగ్ డే నిర్వహించడం జరుగుతుందని . ఇది పిల్లల పూర్తి వికాసానికి దోహద పడుతుందనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బిక్షపతి, ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపాల్ మణికంఠ, ప్రిన్సిపాల్ స్రవంతి, వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు పాషా, చందు , పప్పు విజయ్ ,రవి, యాస్మిన్, సాంబయ్య తోపాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *