- కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కని చంపిన తమ్ముడు..
- కారుతో ఢీకొట్టి, కొడవలితో మెడపై నరికిన పరమేష్..
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో దారుణం..
- లేడీ కానిస్టేబుల్ నాగమణిని నరికి చంపిన తమ్ముడు పరమేష్
రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య చోటు చేసు కుంది. లేడీ కానిస్టేబుల్ ను నరికి చంపాడు సొంత తమ్ముడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది, హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణిని, సొంత తమ్ము డు పరమేష్,దారుణంగా హత్య చేశాడు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె ఇటీవల కులాంతర వివాహం తీసుకుందని, ఆమె కుటుంబ సభ్యులు ఆమెపై చాలా రోజుల నుండి ఆగ్రహంతో ఉన్నారు. సమయం కోసం వేచి చూచిన తమ్ముడు ఈరోజు ఉదయం బైకుపై డ్యూటీ కి వెళ్తున్న నాగమణిని రాయపోలు, ఎండ్లగూడ, రోడ్డు మార్గంలో కారుతో ఢీ కొట్టి అనంతరం కత్తితో మెడపై నరికి చంపాడు..ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.