పోలీసులపై సీఎం వరాల జల్లు.. హోంగార్డుల జీతాలు పెంచుతూ ఆదేశాలు

పోలీసులపై సీఎం వరాల జల్లు..

హోంగార్డుల జీతాలు పెంచుతూ ఆదేశాలు

 

పీపుల్స్ డైరీ:

రాష్ట్రంలోని హోంగార్డుల జీతాలు పెంచుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. హోంగార్డు దినసరి జీతభత్యాన్ని వెయ్యి రూపాయలకు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ(Telangana)లోని పోలీసులపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్రజాపాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హెచ్ఎండీఏలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని హోంగార్డుల జీతాలు పెంచుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. హోంగార్డు దినసరి జీతభత్యాన్ని వెయ్యి రూపాయలకు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది.ఈ పెంచిన జీతాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనుంది. ఇక విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన హోంగార్డులు, పోలీసులకు రూ.5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించారు. పోలీసులకు ఆరోగ్యశ్రీ(Aarogyasree)లో హెల్త్ కార్డులు అందజేసే విషయంపై కూడా ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక పోలీసుల పిల్లలకు ఉచిత విద్యుత్ అందించేందుకు 50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మించడం జరుగుతుందన్నారు. హోంగార్డుల వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.200 కు పెంచింది ప్రభుత్వం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *