గజ గజ….పెరిగిన చలి… బయటకు రావాలంటే వణుకుతున్న జనం

 

గజ గజ….పెరిగిన చలి…

బయటకు రావాలంటే వణుకుతున్న జనం

పీపుల్స్ డైరీ:

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతున్నది. గత రెండు రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.. సాయంత్రమైందంటే ఇండ్ల తలుపులు, కిటికీలు మూసేయడం, రాత్రి ఫ్యాన్లు ఆపేసే పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున వివిధ పనులపై బయటకు వెళ్లేవారు స్వెటర్లు, మఫ్లర్లు, చలికోట్లు ధరించి బయటికి వస్తున్నారు. జంటనగరాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.

 

ఈ ఏడాది వింటర్ సీజన్ ప్రారంభంలోనే చలి జనాలను వణికిస్తుంది. రికార్డుస్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత పది రోజులుగా ( నవంబర్ 30 నుండి నేటికి) 12 డిగ్రీలు నమోదవుతుంది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది (2024) నవంబర్ చివరి వారంలో దాదాపు చలి రెట్టింపయింది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులకు జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 8 గంటలకు సూర్యుడు మసక మసకగా దర్శనమిస్తున్నాడు. వాకింగ్ చేసే వృద్ధులు.. స్కూళ్లకు వెళ్లే చిన్నారులు.. పనులకు.. ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో 3.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 

హైదరాబాద్ నగరంలో నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆరు గంటలు దాటితే ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. నగరంలో చాలా చోట్ల 15 డిగ్రీల సెల్సియస్, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఉదయం పొగ మంచు కురుస్తుండటంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. జిల్లాలో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉంది.దీంతో ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *