ప్రైవేటు పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్

ప్రైవేటు పనులకు గ్రామపంచాయతీ ట్రాక్టర్

నల్లబెల్లి : పీపుల్స్ డైరీ

గ్రామీణ పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వ సంకల్పానికి . గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడంతోపాటు, హరితహారం, పల్లె ప్రకృతి వనం లాంటి మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లు నేడు ప్రైవేట్ పనులలో బిజీగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో కొన్న ట్రాక్టరే కదా అని కొందరు తమ సొంత ట్రాక్టర్‌లా భావిస్తున్నట్లుంది. మేము ఏమి చేసినా నడుస్తుంది అనే కొందరు కార్యదర్శులు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ వనరులను ఉపయోగించి సొమ్ము చేసుకునే ప్రయత్నం, కొంత బంధు ప్రీతి చూపిస్తున్న సంఘటన ముచ్చింపుల్లా గ్రామంలో నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది.

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తుల పనులకు ఇష్టారాజ్యంగా మారింది. నల్లబెల్లి మండల లో ముచింపుల్ల గ్రామం లో ట్రాక్టర్ తో వడ్లు కొనుగోలు కు ఉపయోగిస్తున్నారు.

మండల పరిషత్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ తంతు జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీ నిధుల నుంచి నెలవారీగా ఈఎమ్ఐ రూపంలో లోన్ చెల్లిస్తుంటే ముచ్చింపుల గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మాత్రం బయట ప్రైవేట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోయారు. ఖర్చు ఏమో గ్రామపంచాయతీది లబ్ధి మాత్రం ప్రైవేట్ వ్యక్తిది. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *