*ఘనంగా తులసి పూజ దినోత్సవం
నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో తులసి పూజ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం దేవాలయ ప్రాంగణంలో తులసి గద్దెకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తి గీతాలు ఆలపించారు. ఈ తులసి పూజ దినోత్సవానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సందర్శకులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు పెందోట మురళీ మోహనా చారి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త తాటిపల్లి రవీందర్. గందె శ్రీనివాస్ గుప్తా. గంగిశెట్టి శ్రీనివాస్. పురాం భద్రీనాథ్. మురికి మనోహర్రావు. నాగరాజు. యాదాద్రి భువనగిరి జిల్లా భక్తులు తదితరులు పాల్గొన్నారు..