తెలంగాణలో సంక్రాంతికి ప్రత్యేక బస్సులు!

తెలంగాణలో సంక్రాంతికి ప్రత్యేక బస్సులు!

 

హైదరాబాద్‌: డిసెంబరు29
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు పట్టణ వాసులు సిద్ధమవు తున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేం దుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.గతేడాదితో పోలిస్తే ఈసారి మరిన్ని సర్వీసులను పెంచాలని అధికారులు నిర్ణయించారు.హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాం తాలకు ప్రయాణికులను తరలించేందుకు ఈ సంక్రాం తికి 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నారు.ఏపీతోపాటు తెలంగాణ జిల్లాలకూ సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు నడపను న్నారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం య ధావిధిగా కొనసాగిస్తారు.

అయితే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకే జీరో టికెట్‌ పై ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వర్తిస్తుంది. ఆ తర్వాత టికెట్‌ కొనాల్సిందే. పండగకు సంక్రాంతికి వెళ్లే వారు, పండగ తర్వాత తిరిగి హైదరాబాద్‌ చేరు కునే వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జన వరి మొదటి వారం నుంచి 17వ తేదీ వరకు పది రోజు లు ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచను న్నారు.సంక్రాంతి స్పెషల్‌ బస్సు లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ అధికా రులు శనివారం అధికారి కంగా ప్రకటన చేయను న్నారు.సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.జనవరి 9 నుంచి 13 వరకు సంక్రాంతి ప్రత్యేక బస్సులు అందు బాటులో ఉంటా యని, వీటిని సాధారణ చార్జీలతో ఏపీలోని పలు జిల్లాలకు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎల్‌. విజయలక్ష్మి తెలిపారు.ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా, అధీకృత ఏటీబీ ఏజెంట్ల ద్వారా అడ్వాన్సు గా టికెట్లు బుక్‌ చేసుకోవ చ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *