వివాహం కావడంలేదని యువతి ఆత్మహత్య.
మండలంలోని రుద్రగూడెం గ్రామ శివారు పెద్ద తండా కు చెందిన అజ్మీర వసంత(32) ప్రైవేట్ ఉద్యోగం ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఏ సంబంధం కూడా కుదరకపోవడంతో , తనకంటే చిన్నవారైనా చెల్లెలు ఇద్దరికీ పెళ్లి అయిందని,తనకు ఇంకా పెళ్లి కావడం లేదని , మనస్థాపం చెంది శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి నూరులు కక్కుతుండగా , గమనించిన కుటుంబ సభ్యులు , చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో సాయంత్రం 5:30 గంటల సమయంలో చనిపోయిందనీ,తన అన్న అయిన అజ్మీర రమేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేశారు.