మరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి ఏకపక్ష వైఖరిని విడనాడాలి

మరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి ఏకపక్ష వైఖరిని విడనాడాలి

పిఆర్టియూ మరిపెడ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి


మరిపెడ, జనవరి 5(పీపుల్స్ డైరీ):

మరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి జి.అనితదేవి కెజిబివి లకు వర్కు అడ్జెస్ట్మెంట్ పేరుతో ఒక సంఘానికి చెందిన ఉపాధ్యాయులను ఏకపక్షంగా నియమించడాన్ని పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి, లింగాల మహేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.మా సంఘ సభ్యులను కెజిబివిలలో నియమించి కెజిబివి ఉపాధ్యాయినిల దృష్టిలో మా సంఘాన్ని పలుచన చేసి రాబోయే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ఒక ఉపాధ్యాయ సంఘానికి లబ్ది చేకూర్చి మరోక సంఘాన్ని బలహీన పరిచే కుట్రలో భాగంగానే ఈ ఏకపక్ష నిర్ణయానికి ఒడికట్టిందని అన్నారు.కెజీబివి లకు పురుష ఉపాధ్యాయులను నియమించడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ఒక సంఘానికి చెందిన నాయకుని కనుసన్నలలో పనిచేస్తూ మిగితా సంఘాలను నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకుంది అన్నారు. ఇప్పటికైనా యం.ఈ.ఓ. ఏకపక్ష వైఖరి మారకపోతే ఎంఆర్సి ముట్టడికి పిలుపునిచ్చి,యంఆర్సీ ముందు ఉపాధ్యాయులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *