సబ్ స్టేషన్లకు డిప్యూటీ సీఎం శంకు స్థాపన
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాధపురం గ్రామంలో రూ.8 కోట్ల 40 లక్షలతో నిర్మించే మూడు 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, ఎన్పీడీసీఎల్ చైర్మన్ వరుణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.