*బెయిల్ కోసం నకిలీ షూరిటీ పత్రాలు…. నిందితులు అరెస్ట్*
*మిర్యాలగూడ జనవరి 12 పీపుల్స్ డైరీ):-*
2018 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన సుపారి కిల్లర్ సుభాష్ శర్మ. ఈ సుపారి కిల్లర్ కు ఫెయిల్ ఇచ్చేందుకు నకలి షూరిటీ పత్రాలను అందజేసి కోర్టును మోసం చేసిన కేసులో ముగ్గురు నిందితులను మిర్యాలగూడ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. శనివారండీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం… మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు బెల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. గత కొంతకాలంగా బెయిల్ నిరాకరిస్తున్నారు. 2024 నవంబర్లో సుభాష్ శర్మ బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా షూరిటీలను సమర్పించి జిల్లా కోర్టులో బెయిల్ పొందవలసిందిగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని లాయర్ ద్వారా తెలుసుకున్న కీటపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వంగాల సైదులు మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామానికి చెందిన చింతచెర్ల దేవయ్య, ముక్కమల మల్లేష్ లు ఫోర్జరీ షూరిటీ పత్రాలను తయారు చేసి కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు సూటి పత్రాలపై విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాలు నకిలీ పత్రాలుగా గుర్తించారు. కోర్టును మోసం చేయడంతో పాటు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సమర్పించినందుకు ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా వంగాల సైదులు పై వివిధ పోలీస్ స్టేషన్లో 21 కేసులు నమోదైనట్లు తెలిపారు. మిగిలిన ఇద్దరు కూడా నేర చరిత్ర కలిగిన వారు కావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కోర్టుకు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రూరల్ సీఐ వీరబాబు , వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.