*ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి?*
లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్ బుదవారం ఏసీబీకి చిక్కారు. భూ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.
మెట్ పల్లి పట్టణంలో సాయిరాం కాలనీ లోని 266 గజాల స్థలం ను మార్టిగేజ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ పదివేలు డిమాం డ్ చేశారు. స్తోమత లేని భూ యజమాని ఎసిబికి సమాచారం అందించాడు
దీంతో ఏసిబి డిఎస్పి రమణమూర్తి కార్యాలయం పై దాడులు నిర్వహించి అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
మొదటి విడతలో రూ. 5 వేలు లంచం తీసుకుంటుం డగా ఎసిబి అధికారులు సబ్ రిజిస్ట్రార్ ను పట్టుకున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవి కుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిని అదుపులోకి తీసుకున్నా మని ఏసీబీ అధికారులు తెలిపారు.