*విద్యుత్ వైర్లు తగిలి సెంట్రింగ్ కార్మికుడు మృతి* .
వీటికి కారణం విద్యుత్ అధికారులే.
భవనాలకు అంత దగ్గరగా పోల్స్ లను పెట్టి భవనాలకు తాకే విదంగా లైన్లను వేయడం.
మొత్తం బాధ్యత స్థానిక బిల్డర్,విద్యుత్ అధికారి ఏఈ తీసుకుని వఫై కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆదుకోవాలి.
దుండిగల్, పీపుల్స్ డైరీ,జనవరి 20:
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకాశ లేఔట్ రోడ్ నెంబర్ 3,మల్లంపేట్ లో ఈరోజు సాయంత్రం భవన నిర్మాణ కార్మికుడు ఎలక్ట్రిక్ షాక్ తగిలి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. వివరాల్లోకి వెళితే మృతుడు సిద్ధార్థ వర్మ (31)తండ్రి పేరు నారాయణ,రెండు సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు నిమిత్తం హైదరాబాద్ వచ్చి భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈరోజు పని చేస్తుండగా తను పనిచేస్తున్న నిర్మాణంలో ఉన్న ఇంటికి మొదటి ఫ్లోర్ ఎక్కి సెంట్రింగ్ రాడ్ ఫిట్ చేద్దామని సెంట్రింగ్ రాడ్ చేతిలో పట్టుకుని పొరపాటున పక్కనే ఉన్న రోడ్డుని అనుకోని ఉన్న ఎలక్ట్రిక్ వైరుని ఆర్టీ సెంట్రింగ్ రాడ్ తగలడం వల్ల, ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకు గురై అక్కడికక్కడే కింద పడ్డాడు.సహచరులు అతన్ని వెంటనే మమత హాస్పిటల్ కి అంబులెన్స్ లో తీసుకెళ్లగా,అప్పటికే మరణించినాడని తెలిపినారు.ఇట్టి విషయంలో కేసును నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తంగాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది.