బుర్రకాయాల గూడెం వద్ద కారు డోజర్ ఢీ

పీపుల్స్ డైరీ, గణపురం: మండలంలోని బురకాయల గూడెం వద్ద ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి ట్రాక్టర్ డోజర్ ను కారు ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కారు గణపురం కార్యదర్శికి చెందినదిగా స్థానికులు తెలిపారు.