
పీపుల్స్ డైరీ నల్లబెల్లి
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని గౌడ కాలనీలో తాటి చెట్టు పై బుధవారం ఉదయం పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగాయి. చెట్టుపై ఎండిన ఆకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. తాడిచెట్టు పై పిడుగు పడి మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కానీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.