ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదు
– బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి

పీపుల్స్ డైరీ, గణపురం: అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరైన విధానం కాదని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో వారసంత దగ్గర గత ప్రభుత్వం నిర్మించిన మా ఊరు సంత, పబ్లిక్ టాయిలెట్స్ సుమారు 25 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టినారు నేడు ఎలాంటి అనుమతులు లేకుండా గుత్తేదార్ జెసిబి సహాయంతో వాటిని ధ్వంసం చేయగా విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకొని జెసిబిని ఆపి హెచ్చరించారు. ఇలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన గుత్తేదారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని, అలాగే స్థానిక ఎమ్మెల్యే గత ప్రభుత్వ గుర్తులను చెరిపేసే దురుద్దేశంతో వీటిని ధ్వంసం చేయడం సరైన విధానం, స్థానిక మండల వాసిగా అభివృద్ధికి మా పూర్తి సహకారం ఉంటుందని కానీ అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహా రావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి, మాజీ సర్పంచ్ కట్ల ప్రశాంతి శంకరయ్య, పల్లెబోయిన సదయ్య, మాజీ ఎంపిటిసి మంద అశోక్ రెడ్డి, నాయకులు ఎల్లబోయిన భద్రయ్య, మామిండ్ల సాంబయ్య, ఇమ్రాన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.