జర్నలిస్టుల పక్షాన నిలిచేది “టి.ఎస్.జే.యూ”
– టిఎస్ జేయూ లో పలువురి చేరికలు

పీపుల్స్ డైరీ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ యూజేఐ)లో సభ్యత్వం తీసుకున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ ల ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు సంఘం లో చేరగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి పావుశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా సభ్యత్వం అందజేశారు. సభ్యత్వం తీసుకున్న వారిలో సీనియర్ జర్నలిస్ట్ తడక సుధాకర్ గౌడ్, క్యాతం మహేందర్, రాచర్ల సుధాకర్, సోద కుమారస్వామి తదితరులు వున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జర్నలిస్టుల పక్షాన నిలిచేది టి.ఎస్.జే.యూ అని హక్కుల సాధనా కోసం జర్నలిస్ట్ లు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శులు కడపక రవి, బొచ్చు భూపాల్, బొల్లెపెల్లి జగన్, ప్రచార కార్యదర్శి కారుకూరి సతీష్, మారపల్లి చంద్ర మౌళి, దేవేందర్ దితరులు పాల్గొన్నారు.