ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల

సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితా.. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని, సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలని సూచించింది. 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలని, 10వ తేదీన తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.