*ఆదర్శం కొండాయిలుపల్లి..*
*పేద కుటుంబానికి అండగా నిలిచిన గ్రామం..*

నల్లబెల్లి మండల కేంద్రంలోని కొండాయిలు పల్లి ఒక చిన్న గ్రామం, కానీ మానవత్వం చూపడంలో మాత్రం చాలా పెద్ద మనసు గల గ్రామం.. ఒక పేద కుటుంబంలో సంభవించిన మరణం, వారి ఆర్థిక పరిస్థితులు చూసి ఊరు ఊరంతా చలించింది.. ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఊరంతా ఒక్కటై చేతులు కలిపింది.. ఆ కుటుంబానికి అండై నిలిచింది..
వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం, కొండాయిలు పల్లి గ్రామానికి చెందిన రేశోజు రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.. పలు ఆసుపత్రుల్లో రెండు లక్షల వరకు ఖర్చు చేసినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు. పేద కుటుంబం కావడంతో కొండాయిలు పల్లి గ్రామస్తులంతా ఒక్కటై తలా కొంత ఆర్థిక సాయం జమ చేశారు.. జమ చేసిన మొత్తం 55,700 /- రూపాయలు ఆదివారం గ్రామ పెద్దలు,యువత సమక్షం లో రాజయ్య కుటుంబానికి అందజేశారు.. పేద కుటుంబానికి తామంతా ఉన్నామని ధైర్యాన్ని నింపినందుకు కుటుంబ సభ్యులు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు..