*జాతీయ చిన్న పిల్లల ఉబ్బకాయ అవగాహన మాసం*
*ఈ నెల అంతా పలు కార్యక్రమాలలో మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విద్యార్థులు*
మేడ్చల్, సెప్టెంబర్ 17 (పీపుల్స్ డైరీ )


జాతీయ చిన్న పిల్లల ఊబకాయ అవగాహన మాసం సందర్భంగా
పాఠశాలలోని విద్యార్థులకు, గ్రామాలలోని కుటుంభాలలో ప్రత్యేక సర్వే నిర్వహించడం తో పాటూ ఊబకాయం పై అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడిసిది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సెప్టెంబర్ మాసాన్ని జాతీయ చిన్న పిల్లల ఊబకాయ అవగాహన మాసం గా నిర్వహిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెడిసిటీ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని చిన్న పిల్లల (పీడియాట్రిక్) వైద్య విభాగం వారు పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 11 సెప్టెంబర్ న వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తున్న గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రత్యేక పోస్టర్ ను ప్రదర్శించే పోటీ నిర్వహించారు. అంతే గాకుండా తెలుగు, ఇంగ్లీషు భాషలలో పిల్లలలో ఊబకాయం పై ప్రత్యేక స్లోగన్ (నినాదం) పోటీ కూడా నిర్వహించారు. ఇందులో వైద్య విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సెప్టెంబర్ 13 న న మేడ్చల్ మండలంలోని రాజ్ బొలారం తండా, యాడారం గ్రామాలలో మెడిసిటీ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన కమ్యూనిటీ వైద్య విభాగం వైద్యులు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే నిర్వహించడమే కాకుండా చిన్న పిల్లలున్న ఇళ్లలో ఊబకాయం పై అవగాహన కలిపించడంతో పాటూ ఒక వేళ ఎవరికైనా ఊబకాయం లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అవసరమైన వారికి తదుపరి వైద్య పరీక్షలు కోసం నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని కమ్యూనిటీ మెడిసన్ వైద్య విభాగానికి చెందిన ప్రొఫెసర్, హెచ్ ఓ డి డా. ఈనాక్షి నేతృత్వంలో కమ్యూనిటి మెడిసన్ కు చెందిన వైద్యులు డా. అంకుష్, డా. మృదుల, డా హేమలత, డా శ్రావణి మరియు డా. ప్రాచి లు నిర్వహించారు. సెప్టెంబర్ 15-16 నాడు మెడిసిటీ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన పీడియాట్రిక్ (చిన్న పిల్లల) వైద్య విభాగానికి చెందిన వైద్యులు అలాయిబాదులోని దక్ష హై స్కూల్, జిల్లా పరిషత్తు హైస్కూలు, ఘన్ పూర్ లలో 6 నుండి 10 వ తరగతి పిల్లలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఒకొక్క స్కూలు లో రోజంతా నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా వైద్యులు, వైద్య సిబ్బంది కలసి సమతుల్య ఆహారం పై ప్రత్యేక నాటకాన్ని (స్కిర్ట్) ప్రదర్శనతో పాటూ ట్రాఫిక్ లైట్ ఫుడ్ ఆట నిర్వహించారు. దీంతో పాటూ ఊబకాయం-పరిరక్షణ పై తయారు చేసిన ప్రత్యేక ఫిల్మ్ ను పిల్లలకు ప్రదర్శించి వివరించారు. తర్వాత పిల్లలను చిన్న చిన్న సమూహాలుగా విడగొట్టి ఆరోగ్యవంతమైన ఆహారం పై చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా గ్రామాలలో, పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ప్రారంభ సమయంలోనూ అటు పిమ్మట కార్యక్రమాలు ముగించిన తర్వాత గ్రామస్థులకు, కుటుంభ సభ్యులకు, పాఠశాలలోని ఉపాధ్యాయులు, పిల్లలకు ప్రత్యేక ప్రశ్నావలి అందించి సమాధానాలు సేకరించారు. ఈ సమాధానాలను విశ్లేషించి ఈ గ్రామాలలో, స్కూళ్లలలో తదుపరి కార్యాచరణ చేపట్టపోతున్నారు. అంతే గాకుండా ఊబకాయం, పౌష్టికాహారం పై ముద్రించిన ప్రత్యేక సాహిత్యాన్ని కూడా గ్రామాలలో, పాఠశాలలో వైద్యులు, వైద్య విద్యార్థులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాలలో పీడియాట్రిక్ వైద్య విభాగానికి చెందిన విభాగాధిపతి డా. సుదర్శన్ రాజ్ నేతృత్వంలో ప్రొఫెసర్ డా. యస్ ప్రీతి తో పాటూ వైద్యులు డా. మహిత కె. డా. మనోహర్ బి, డా. బద్రి యం, డా. శశాంక్ మరియు డా. అరవింద్ లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ప్రొఫెసర్ శివరామకృష్ణ, ప్రెసిడెంట్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ వారితో పాటూ ఫ్రొఫెసర్ డా. దేవేంద్ర సింగ్ నేగి, ప్రిన్సిపాల్, మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డా. సి గీత, డైరెక్టర్, మెడికల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ డా. సుదర్శన్ రాజ్, విభాగాధిపతి, పీడియాట్రిక్ విభాగం, మెడిసిటీ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డా. ఈనాక్షి, విభాగాధిపతి, కమ్యూనిటీ మెడిసన్ విభాగం, మెడిసిటీ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తో పాటూ వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ మరియు పారా మెడికల్ సిబ్బంది తో పాటూ గ్రామస్థులు, పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.