
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ మృతి చెందినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద నేటి రాత్రి 9.00 గంటల నుండి ప్రజలు,అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. రేపు మధ్యాహ్నం హన్మకొండలోని పద్మాక్షమ్మ గుట్ట పక్కన గల శివముక్తి ధామ్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.