పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి:టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్

పటాన్ చేరు అక్టోబర్ 12 (పీపుల్స్ డైరీ):కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో, ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ, అంగన్వాడి కేంద్రం వద్ద పాల్గొని చిన్నారులకు టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం మరియుమన అందరి బాధ్యత ఎన్ని పనులున్నప్పటికీ తల్లిదండ్రులు కచ్చితంగా ఈ యొక్క కేంద్రాలను సందర్శించి మీ పిల్లలకు పల్స్ పోలియో వేయించాలని కోరారు