ములుగు ఎస్పీగా సుధీర్ రాంనాథ్
ములుగు, నవంబర్ 21 (పీపుల్స్ డైరీ):

ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ బదిలీ అయ్యారు. ఆయనను మహబూబాబాద్ ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. తాజాగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ, ములుగు జిల్లా నూతన ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్నును నియమించింది. గతంలో ఆయన ములుగు అడిషనల్ ఎస్పీగా పని చేశారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.