ఇంటర్ ఫలితాలలో గురుకుల విద్యార్థుల ప్రతిభ
ఏన్కూరు ఏప్రిల్ 12 పీపుల్స్ డైరీ.

ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఏన్కూరులోని బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఫలితాలలో పొట్ట పింజర జాన్సన్ 470 మార్కులకు గాను 465 మార్కులు , తవటపు భువన్ 465 మార్కులు, లకావత్ విష్ణు 464 మార్కులు, లింగ బోయిన యోగీశ్వర్ 462 మార్కులు, ఏలూరి అభిలాష్ 462 మార్కులు, గోనె జగదీష్ 461 మార్కులు, కాసాని అభి 460 మార్కులు సాధించి తన ప్రతిభను కనబరిచారు. అదేవిధంగా బైపిసి విభాగంలో కమతల ఉదయ్ కుమార్ 440 మార్కులకు గాను 429 మార్కులు, జాది హేమంత్ 427 మార్కులు, పోలూరి లక్ష్మణ్ 423 మార్కులు, బోసు గణేష్ 420 మార్కులు ,సంకా రితీష్ 414 మార్కులు, మైడితల పల్లి నిఖిల్ 414 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ విద్యార్థులను ప్రిన్సిపాల్ వేమురాజు అధ్యాపకులు అభినందించారు. ఎంపీసీ విభాగంలో నూరు శాతం ఫలితాలు సాధించగా బైపీసీ విభాగంలో 96.96 శాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ వేము రాజు తెలిపారు.