People's Diary https://peoplesdairy.in Telugu National Daily Sat, 16 Nov 2024 10:16:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7 https://peoplesdairy.in/wp-content/uploads/2024/09/cropped-LOGOB-32x32.png People's Diary https://peoplesdairy.in 32 32 రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి https://peoplesdairy.in/2024/11/16/a-young-man-died-in-a-road-accident/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=a-young-man-died-in-a-road-accident https://peoplesdairy.in/2024/11/16/a-young-man-died-in-a-road-accident/#respond Sat, 16 Nov 2024 10:16:51 +0000 https://peoplesdairy.in/?p=1340 రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చర్ల, నవంబర్‌ 16 (పీపుల్స్‌డైరీ) : చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్‌ సుక్మా ప్రాంతానికి దగ్గరలో ఉన్న దోర్నపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. అయితే సీఆర్పీఎఫ్‌ వాహనం బైక్‌ రైడర్‌ను ఢీ…

The post రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి first appeared on People's Diary.

]]>
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

చర్ల, నవంబర్‌ 16 (పీపుల్స్‌డైరీ) : చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్‌ సుక్మా ప్రాంతానికి దగ్గరలో ఉన్న దోర్నపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. అయితే సీఆర్పీఎఫ్‌ వాహనం బైక్‌ రైడర్‌ను ఢీ కొట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వాహనం దోర్నపాల్‌ పోలీసుల అదుపులో ఉంది. వాహనం ఏ బెటాలియన్‌కి సంబంధించింది అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోర్నపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ సిన్హా ఈ విషయాన్ని తెలియ చేసారు.

The post రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి first appeared on People's Diary.

]]>
https://peoplesdairy.in/2024/11/16/a-young-man-died-in-a-road-accident/feed/ 0
భారీ ఎన్‌కౌంటర్‌… https://peoplesdairy.in/2024/11/16/big-encounter/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=big-encounter https://peoplesdairy.in/2024/11/16/big-encounter/#respond Sat, 16 Nov 2024 10:14:28 +0000 https://peoplesdairy.in/?p=1337 భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర పోరు అబూజ్మాద్‌లో భద్రతా బలగాల మేజర్‌ ఆపరేషన్‌ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టు మృతి? ఇంకా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌ మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌ ఇద్దరు జవాన్లకు గాయాలు చర్ల, నవంబర్‌ 16 (పీపుల్స్‌డైరీ) :…

The post భారీ ఎన్‌కౌంటర్‌… first appeared on People's Diary.

]]>
  • భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర పోరు
  • అబూజ్మాద్‌లో భద్రతా బలగాల మేజర్‌ ఆపరేషన్‌
  • ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టు మృతి?
  • ఇంకా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌
  • మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌
  • ఇద్దరు జవాన్లకు గాయాలు
  • చర్ల, నవంబర్‌ 16 (పీపుల్స్‌డైరీ) : చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌, కంకేర్‌ జిల్లాల్లోని అబుజ్మద్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. శనివారం ఉదయం నుంచి ఈ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. మహారాష్ట్రకు చెందిన సి-60 కమాండోలతో కలిసి కంకేర్‌-నారాయణపూర్‌ జిల్లా పోలీసులు నిర్వహించిన అతిపెద్ద ఆపరేషన్‌గా ఇది తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతం రెండు వైపుల నుండి అడపాదడపా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సైనికులు గాయపడినట్లు కూడా సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు అభయ్‌ను చుట్టుముట్టేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భద్రతా దళాల ఉమ్మడి పార్టీ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. అభయ్‌ సమీపంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఎన్‌కౌంటర్‌ను కాంకేర్‌ ఎస్పీ ఐకె ఎలిసెలా ధృవీకరించారు. గాయపడిన సైనికులను అటవీ ప్రాంతం నుంచి రక్షించేందుకు వీI17 హెలికాప్టర్‌ను పంపారు. గాయపడిన సైనికులను వీI 17 హెలికాప్టర్‌ను అడవిలోనే ల్యాండ్‌ చేసి రాయ్‌పూర్‌కు పంపనున్నట్లు సమాచారం.

    The post భారీ ఎన్‌కౌంటర్‌… first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/16/big-encounter/feed/ 0
    మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరణ… https://peoplesdairy.in/2024/11/15/abduction-of-the-cord-from-the-womans-neck/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=abduction-of-the-cord-from-the-womans-neck https://peoplesdairy.in/2024/11/15/abduction-of-the-cord-from-the-womans-neck/#respond Fri, 15 Nov 2024 15:10:47 +0000 https://peoplesdairy.in/?p=1332 మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరణ దుగ్గొండి : మహిళ మెడలోంచి రెండున్నర తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన సంఘటన మండల పరిధి లక్నేపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నీలోజు వెంకటేశ్వర్లు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మంపేటకు…

    The post మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరణ… first appeared on People's Diary.

    ]]>
    మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరణ

    దుగ్గొండి : మహిళ మెడలోంచి రెండున్నర తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన సంఘటన మండల పరిధి లక్నేపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నీలోజు వెంకటేశ్వర్లు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మంపేటకు చెందిన పాలడుగుల మల్లమ్మ(70) శుక్రవారం నర్సంపేటలో పనులు ముగించుకొని లక్నేపళ్లిలో దిగి తిమ్మంపేటకు కాలినడకన నడుచుకుంటూ వెళుతుండగా అంతలోనే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మల్లమ్మ మెడలోంచి రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కొని వెళ్లారు.ఓ వ్యక్తి వారిని పట్టుకునే ప్రయత్నం చేసినా దుండగులు దొరకలేదు. అదే సమయంలో ఆమె మల్లమ్మ మెడకు చిన్న గాయం పడింది. బైక్‌పై పరారవుతున్న వారిని మల్లమ్మ వెంబడించినా ఫలితం లేకపోయింది. బైక్‌పై వచ్చిన వారి వయసు సుమారు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని వారు తెలిపారు. మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మల్లమ్మ మెడకు గాయం అవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

    The post మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరణ… first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/15/abduction-of-the-cord-from-the-womans-neck/feed/ 0
    సేవల పేరుతో స్వాహా… https://peoplesdairy.in/2024/11/12/swaha-in-the-name-of-services/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=swaha-in-the-name-of-services https://peoplesdairy.in/2024/11/12/swaha-in-the-name-of-services/#respond Tue, 12 Nov 2024 07:04:41 +0000 https://peoplesdairy.in/?p=1324 నగరంలో అభయ ఫౌండేషన్‌ ఫర్‌ డెవలప్మెంట్‌ సొసైటీ మోసాలు అమాయక మహిళలకు కుచ్చుటోపీ బ్యాంక్‌ లోన్స్‌, ఫైనాన్స్‌ పేరిట అక్రమ వసూళ్లు… సామాన్యుల అవసరాలను ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వైనం తమ డబ్బులు తమకివ్వాలని అడిగితే బెదిరింపులు… చెప్పులరిగేలా తిరుగుతున్న…

    The post సేవల పేరుతో స్వాహా… first appeared on People's Diary.

    ]]>
    నగరంలో అభయ ఫౌండేషన్‌ ఫర్‌ డెవలప్మెంట్‌ సొసైటీ మోసాలు
    • అమాయక మహిళలకు కుచ్చుటోపీ

    • బ్యాంక్‌ లోన్స్‌, ఫైనాన్స్‌ పేరిట అక్రమ వసూళ్లు…

    • సామాన్యుల అవసరాలను ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వైనం

    • తమ డబ్బులు తమకివ్వాలని అడిగితే బెదిరింపులు…

    • చెప్పులరిగేలా తిరుగుతున్న బాధితులు

    • పోలీసులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న బాధితులు

    పూర్తి వివరాలు ‘పీపుల్స్‌డైరీ’ రేపటి సంచికలో…

    The post సేవల పేరుతో స్వాహా… first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/12/swaha-in-the-name-of-services/feed/ 0
    ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై కలెక్టర్ ఆగ్రహం https://peoplesdairy.in/2024/11/10/the-collector-is-angry-with-the-ashram-school-warden/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=the-collector-is-angry-with-the-ashram-school-warden https://peoplesdairy.in/2024/11/10/the-collector-is-angry-with-the-ashram-school-warden/#respond Sun, 10 Nov 2024 13:59:34 +0000 https://peoplesdairy.in/?p=1320 కలెక్టర్ ఆకస్మిక తనిఖీ… నల్లబెల్లి: మండలంలోని మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఫై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని రుద్రగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే…

    The post ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై కలెక్టర్ ఆగ్రహం first appeared on People's Diary.

    ]]>
    కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

    నల్లబెల్లి: మండలంలోని మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఫై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని రుద్రగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం ఆమె మూడు చెక్కలపల్లి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలనుఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని వంట గదిని పరిశీలించారు. స్టీమ్ ఇంజన్ (ఆవిరి యంత్రం )నిరూపయోగంగా ఉండటానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వంట పాత్రలు, పరిసరాలను పరిశుభ్రంగా ‘ఉంచుకోవాలని సూచించారు.

    ల్యాబ్ లో పరికరాలు సరిగా లేకపోవడంతో ఆశ్చర్యానికి గురైన ఆమె ప్రధానోపాధ్యాయుడి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు ముందు ఉండవలసిన ఫిర్యాదుల పెట్టే వార్డెన్ రూమ్ లో ఉండడం పట్ల ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సంబంధిత శాఖ ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి వెంటనే ఫిర్యాదులు పెట్టెను ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీను తో పాటు హాస్టల్ వార్డెన్ వీరమ్మ కు షోకాజు నోటీసులు అందజేశారు. వీరి వెంట జడ్పీ సీఈవో, స్థానిక తహసీల్దార్ ముప్పు కృష్ణ తదితరులు ఉన్నారు.

    The post ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై కలెక్టర్ ఆగ్రహం first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/10/the-collector-is-angry-with-the-ashram-school-warden/feed/ 0
    సీనియర్‌ కార్యకర్త గోపాల్‌కు ‘బండి’ పరామర్శ https://peoplesdairy.in/2024/11/10/senior-activist-gopal-was-approached-by-bandi/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=senior-activist-gopal-was-approached-by-bandi https://peoplesdairy.in/2024/11/10/senior-activist-gopal-was-approached-by-bandi/#respond Sun, 10 Nov 2024 13:53:11 +0000 https://peoplesdairy.in/?p=1316 సీనియర్‌ కార్యకర్త గోపాల్‌కు ‘బండి’ పరామర్శ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి సైదాపూర్‌, నవంబర్‌ 10 (పీపుల్స్‌డైరీ) : కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండల కేంద్రానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో మొదటిసారి రాగా పార్టీ ఆధ్వర్యంలో…

    The post సీనియర్‌ కార్యకర్త గోపాల్‌కు ‘బండి’ పరామర్శ first appeared on People's Diary.

    ]]>
    సీనియర్‌ కార్యకర్త గోపాల్‌కు ‘బండి’ పరామర్శ
    అధైర్యపడొద్దని ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి

    సైదాపూర్‌, నవంబర్‌ 10 (పీపుల్స్‌డైరీ) : కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండల కేంద్రానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో మొదటిసారి రాగా పార్టీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సైదాపూర్‌ గ్రామానికి చెందిన సీనియర్‌ కార్యకర్త దాసరి గోపాల్‌ను బండి సంజయ్‌ కుమార్‌ పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గత కొన్ని నెలల క్రితం టాక్టర్‌ రోటోవేటర్లో కాలుపడి నుజ్జునుజ్జు అయి కాలు తీసివేయడంతో అంగవైకల్యంతో బాధపడుతున్న దాసరి గోపాల్‌కు బండి సంజయ్‌ కుమార్‌ ధైర్యం చెప్పి బాధితునికి ప్రభుత్వం తరఫున టూ వీలర్‌ బ్యాటరీ బండి ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌ రెడ్డి, వెన్కేపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు జంపాల సంతోష్‌, గుర్రాల లక్ష్మారెడ్డి, సీనియర్‌ నాయకులు వీరమల్ల రవీందర్‌ రెడ్డి ముత్యాల రమణారెడ్డి వంగ సాగర్‌ నెల్లి శ్రీనివాస్‌ దెంచనాల శ్రీనివాస్‌ భరద్వాజ్‌ మెరుగు శ్రీనివాస్‌ గుర్రాల అశోక్‌ రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు ఉన్నారు.

    The post సీనియర్‌ కార్యకర్త గోపాల్‌కు ‘బండి’ పరామర్శ first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/10/senior-activist-gopal-was-approached-by-bandi/feed/ 0
    కేసీఆర్‌ యాక్టివ్‌ మోడ్‌… https://peoplesdairy.in/2024/11/10/kcr-active-mode/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=kcr-active-mode https://peoplesdairy.in/2024/11/10/kcr-active-mode/#respond Sun, 10 Nov 2024 13:49:19 +0000 https://peoplesdairy.in/?p=1313 కారు నడిపిన కేటీఆర్‌… సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌ పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : కేసీఆర్‌ యాక్టివ్‌ మోడ్‌లోకి మారిపోతున్నారు. కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తిరిగి యాక్టివ్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది.…

    The post కేసీఆర్‌ యాక్టివ్‌ మోడ్‌… first appeared on People's Diary.

    ]]>
  • కారు నడిపిన కేటీఆర్‌…
  • సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌
  • పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : కేసీఆర్‌ యాక్టివ్‌ మోడ్‌లోకి మారిపోతున్నారు. కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తిరిగి యాక్టివ్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్న గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో పాలకుర్తి నియోజకవర్గం నేతలతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. త్వరలో జిల్లాల యాత్రలు చేసే అవకాశం ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎర్రవల్లి ఫాం హౌస్‌లో కారు నడుపుతూ కేసీఆర్‌ కనిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, చేవెళ్ల యువనేత పట్లోల్ల కార్తీక్‌ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని కారు నడిపారు కేసీఆర్‌. ఫామ్‌హౌస్‌లో సాగవుతున్న పంట పొలాలను పరిశీలించి, వాటి గురించి కార్తీక్‌ రెడ్డికి వివరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ నడిపిన కారు ‘మెర్సిడెస్‌ బెంజ్‌’ అని తెలుస్తోంది. వైట్‌ కలర్‌లో కారు రాయల్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది జులైలో కేసీఆర్‌ ఓమ్నీ వ్యాన్‌ నడిపిన సంగతి తెలిసిందే. డాక్టర్ల సూచనతో నాడు ఆయన తన ఫాం హౌస్‌లో వ్యాన్‌ నడిపారు. ఒంటరిగా కాసేపు వ్యాన్‌లో కలియతిరిగారు. గత ఏడాడి డిసెంబర్‌ 8న అర్ధరాత్రి ఇంట్లో కాలు జారిపడటంతో కేసీఆర్‌ తుంటి ఎముక విరిగింది. యశోదా ఆస్పత్రిలో డాక్టర్ల చికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్‌.. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా కేసీఆర్‌ కారు నడిపిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టైగర్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ‘కారు మాదే.. నడిపేది మేమే’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టాడు. ‘ఈసారి కారు జోరును అడ్డుకోలేరు’ అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు.

    The post కేసీఆర్‌ యాక్టివ్‌ మోడ్‌… first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/10/kcr-active-mode/feed/ 0
    అరుదైన ఘటన… https://peoplesdairy.in/2024/11/10/a-rare-event/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=a-rare-event https://peoplesdairy.in/2024/11/10/a-rare-event/#respond Sun, 10 Nov 2024 13:46:35 +0000 https://peoplesdairy.in/?p=1310 చలనం లేకుండా పుట్టిన శిశువు మృతిచెందినట్టు నిర్ధారించిన వైద్యులు 7 గంటల తర్వాత బతికిన శిశువు విశాఖపట్నంలో ఆశ్చకర ఘటన పీపుల్స్‌డైరీ`విశాఖపట్నం : డెలివరీ కోసం వెళ్లిన ఆ దంపతులకు చలనం లేకుండా శిశువు జన్మించాడు. ఎంతో ఆనందకరమైన ఆ సమయంలో…

    The post అరుదైన ఘటన… first appeared on People's Diary.

    ]]>
  • చలనం లేకుండా పుట్టిన శిశువు
  • మృతిచెందినట్టు నిర్ధారించిన వైద్యులు
  • 7 గంటల తర్వాత బతికిన శిశువు
  • విశాఖపట్నంలో ఆశ్చకర ఘటన
  • పీపుల్స్‌డైరీ`విశాఖపట్నం : డెలివరీ కోసం వెళ్లిన ఆ దంపతులకు చలనం లేకుండా శిశువు జన్మించాడు. ఎంతో ఆనందకరమైన ఆ సమయంలో శిశువు ఊపిరి లేకపోవడంతో ఆ దంపతులు విలవిలలాడిపోయారు. ఇక ఆ బాబు చనిపోయాడని వైద్యులు కూడా నిర్దారించారు. ఇక ఆ విషాద సమయంలో 7 గంటల తర్వాత బాబులో కదలిక కావడంతో ఆ దంపతుల్లో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే… విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రిలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఎటువంటి చలనం లేకుండా ఉండంటం, ఊపిరి కూడా లేకపోవటంతో చనిపోయాడని డిసైడ్‌ అయ్యారు. అయితే ఆశ్చర్యకరంగా పుట్టిన 7 గంటల తర్వాత శిశువులో చలనం వచ్చింది. విశాఖ కేజీహెచ్‌లో శుక్రవారం రాత్రి 9 గంటలకి చలనం లేకుండా శిశువు జన్మించగా.. డాక్టర్లు రాత్రంతా రాత్రంతా శ్రమించారు. అయినా శిశువులో ఎటువంటి చలనం కనిపించలేదు. దీంతో శిశువు మృతిచెందినట్లు హాస్పిటల్‌ సిబ్బంది రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును సిబ్బంది తండ్రికి అప్పగించారు. శిశువును అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న సమయంలో తండ్రి చేతుల్లోని శిశువులో కదలిక గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. శిశువుకి వైద్యం చేశారు. శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకించారు. చనిపోయాడని భావించిన శిశువు బతికే ఉండటంతో ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు.
    విశాఖపట్నంలోని ఒక కాలనీకి చెందిన గర్భిణీ పురిటి నొప్పులతో గతరాత్రి కేజీహెచ్‌ గైనకాలజీ వార్డులో చేరారు. డాక్టర్లు సిజేరియన్‌ చేసి గర్బిణీకి ప్రసవం చేశారు. మగబిడ్డ జన్మించినప్పటికీ బరువు తక్కువగా ఉంది. శిశువులో ఎటువంటి చలనం లేదు. దీంతో అవసరమైన వైద్య సేవలను డాక్టర్లు అందించారు. శనివారం తెల్లవారుజాము వరకు ప్రయత్నించినా ఉపయోగం లేదు. దానికి తోడు శిశువు ఊపిరి ఆగిపోయింది. విధుల్లో ఉన్న డాక్టర్లు శిశువును పరిశీలించి.. చనిపోయినట్లు నిర్ధారించారు. హాస్పిటల్‌ రికార్డుల్లోనూ శిశువు మృతి చెందినట్లు నమోదు చేశారు. అనంతరం శిశువును కుటుంబ సభ్యులకు అందించగా.. తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. శిశువును ఇంటికి తీసుకెళ్లి ఖననం చేసేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. అంబులెన్స్‌లో ఎక్కే సమయంలో తండ్రి చేతుల్లోని శిశవులో కదలికలను కుటుంబ సభ్యులు గమనించారు.

    The post అరుదైన ఘటన… first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/10/a-rare-event/feed/ 0
    టెన్త్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ రిలీజ్‌ https://peoplesdairy.in/2024/11/10/10th-exam-fee-schedule-released/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=10th-exam-fee-schedule-released https://peoplesdairy.in/2024/11/10/10th-exam-fee-schedule-released/#respond Sun, 10 Nov 2024 13:43:18 +0000 https://peoplesdairy.in/?p=1307 టెన్త్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ రిలీజ్‌ నవంబర్‌ 18.. చివరి తేదీ పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు…

    The post టెన్త్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ రిలీజ్‌ first appeared on People's Diary.

    ]]>
    టెన్త్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ రిలీజ్‌
    నవంబర్‌ 18.. చివరి తేదీ

    పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులకు వచ్చే మార్చిలో జరిగే పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 18వ తేదీలోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్షల ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ తెలిపారు. పరీక్షల ఫీజును రూ.125గా నిర్ణయించామన్నారు. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.25 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు సమాచారం.

    The post టెన్త్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ రిలీజ్‌ first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/10/10th-exam-fee-schedule-released/feed/ 0
    ఇద్దరు పిల్లల్ని చెరువులో తోసి తండ్రి ఆత్మహత్య https://peoplesdairy.in/2024/11/10/father-committed-suicide-by-throwing-two-children-in-the-pond/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=father-committed-suicide-by-throwing-two-children-in-the-pond https://peoplesdairy.in/2024/11/10/father-committed-suicide-by-throwing-two-children-in-the-pond/#respond Sun, 10 Nov 2024 13:40:14 +0000 https://peoplesdairy.in/?p=1304 ఎంత పనిచేశావ్‌ భయ్యా… కుటుంబ కలహాలే కారణమా? సిద్దిపేటలో విషాదం.. పీపుల్స్‌డైరీ`సిద్దిపేట : ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో గానీ తన ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే……

    The post ఇద్దరు పిల్లల్ని చెరువులో తోసి తండ్రి ఆత్మహత్య first appeared on People's Diary.

    ]]>
  • ఎంత పనిచేశావ్‌ భయ్యా…
  • కుటుంబ కలహాలే కారణమా?
  • సిద్దిపేటలో విషాదం..
  • పీపుల్స్‌డైరీ`సిద్దిపేట : ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో గానీ తన ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తన భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో చింతల్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు సిద్దిపేట వాసవి నగర్‌ కు చెందిన తేలు సత్యం (48), అతని కొడుకు అన్వేష్‌ (7), కూతురు త్రివేణి (5) పోలీసులు గుర్తించారు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సత్యం రెండో భార్య తేలు శిరీష గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది.. దీంతో మనస్తాపంతో పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. కాగా సత్యంకు మొదట ఒక పెళ్లి అయింది.. ఆ తర్వాత మొదటి భార్య మృతి చెందింది.. ఆమెకు ఇద్దరు పిల్లలు(పెద్దవారు).. మొదటి భార్య చనిపోయిన అనంతరం సత్యం రెండవ పెళ్లి చేసుకున్నాడు.. రెండవ భార్య శిరిషకు ఇద్దరు పిల్లలు.. కాగా గత కొద్దిరోజులుగా సత్యంకు అనారోగ్య సమస్యలు రావడం.. దీనికి తోడు ఇంట్లో కూడా గొడవలు జరగడంతో.. రెండవ భార్య శిరీష ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులుగా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో మనస్తాపం చెందిన సత్యం.. తన రెండవ భార్య పిల్లలతో కలిసి ఎర్రచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట టూ టౌన్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు.. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    The post ఇద్దరు పిల్లల్ని చెరువులో తోసి తండ్రి ఆత్మహత్య first appeared on People's Diary.

    ]]>
    https://peoplesdairy.in/2024/11/10/father-committed-suicide-by-throwing-two-children-in-the-pond/feed/ 0